సూర్యాపేట, వెలుగు : ఈనెల 28న నిర్వహించనున్న ప్రజా యుద్ధనౌక గద్దర్ గానస్మరణ (ప్రథమ వర్ధంతి) సభ జయప్రదం చేయాలని ఏపూరి సోమన్న పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో ‘చలో సూర్యాపేట గద్దర్ గానస్మరణ సభ’ పోస్టర్ ను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని సూర్యాపేటలో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సభకు ముఖ్యఅతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఉద్యమ నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా కళాకారులు సభకు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రమేశ్, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, నవిలే ఉపేందర్, విప్లవ్ కుమార్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.