భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలోని తూర్పు కనుమల్లో జలవృక్షాలు కనువిందు చేస్తున్నాయి. భద్రాచలం సరిహద్దున ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని కింటుకూరు బేస్ క్యాంపులో 40 ఏళ్ల నాటి నల్లమద్ది చెట్ల నుంచి జలధారలు వస్తున్నాయి.
శనివారం డీఎఫ్వో నరేంద్రన్, గోకవరం రేంజర్ దుర్గాకుమార్ ఈ చెట్లను పరిశీలించి.. నీటిని తాగారు. చెట్టుకు గాటు పెడితే రోజుకు 10 నుంచి 20 లీటర్ల వరకు నీళ్లు ధారగా వస్తుంటాయని, వీటిని కనిపేట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులుంటాయని వారు పేర్కొన్నారు.