కుటుంబ కలహాలతో ఏ‌ఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పెన్ పహాడ్,వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్  ఒకరు పెన్ పహాడ్  మండలం ధర్మపురంలో బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే సూసైడ్​ కు కారణమని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. పెన్ పహాడ్  మండలం ధర్మపురం గ్రామానికి చెందిన అర్రూరి సైదులు (45) సూర్యాపేట టౌన్​లో ఏ‌ఆర్  కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.

కొంతకాలంగా సైదులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో  మనస్తాపం చెందిన సైదులు బుధవారం తెల్లవారుజామున పెన్ పహాడ్ మండలం ధర్మపురంలోని పొలం వద్ద  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ జనరల్  దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.