తనను పెండ్లి చేసుకోవాలని తరచూ ఫోన్‌కాల్స్
పెండ్లి సంబంధాలు చెడగొడుతూ బెదిరింపులు
గ్రీన్‌ఫార్మాసిటీ పీఎస్‌లో కేసు నమోదు
ఇబ్రహీంపట్నం, వెలుగు: తనను ప్రేమించాలని, పెండ్లి చేసుకుంటానని ఇంటి పక్కన యువతిని బెదిరిస్తున్న ఏఆర్కానిస్టేబుల్పై రంగారెడ్డి జిల్లా గ్రీన్ఫార్మా సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందిన యువతి చదువుకుంటూనే కర్మన్‌ఘాట్‌లో పార్ట్ టైం జాబ్చేస్తోంది.
ఇంటి పక్కనే ఉండే ఏఆర్ కానిస్టేబుల్ రావుల రమేశ్అప్పుడప్పుడు యువతితో మాట్లాడేవాడు. ఫోన్నంబర్తీసుకున్నాడు. ఓ బ్రదర్ లాగా మాట్లాడుతుండడంతో యువతి కూడా మాట్లాడేది. ఈ క్రమంలో తనను ప్రేమించాలని, పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. యువతి అందుకు నిరాకరించడంతో తరచూ కర్మాన్‌ఘాట్‌లో ఆమె పనిచేసే చోటికి వెళ్లి రమేశ్వేధిస్తున్నాడు.
బాధితురాలికి ఇటీవల వచ్చిన పెండ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు. తట్టుకోలేకపోయిన ఆమె గ్రీన్ఫార్మా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రమేశ్అంబర్పేటలోని పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.