ఎలాంటి విచారణకైనా సిద్ధం: ఏఆర్ డెయిరీ

టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది.ఎలాంటి న్యాయ విచా రణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తామేం తప్పు చేయలేదని నిరూపించుకుంటామని చెప్పింది. 

ALSO READ :గోవధ నిషేధ చట్టాలు తెస్తే ఇలాంటి ఘటనలు జరగవు: యుగ తులిసి ఫౌండేషన్ ఛైర్మన్

జూన్, జులైలో  టీటీడీకి పంపిన నెయ్యి అంతా అక్కడి అధికారులు తిరిగి పంపించేశారని తెలిపింది. క్వాలిటీ నెయ్యినే పంపించామని, టెస్ట్ చేశాకే లారీలు కంపెనీ నుంచి బయటికెళ్తాయని వివరించింది. టెస్ట్ రిపోర్టు కూడా లారీలతోనే టీటీడీకి పంపిస్తామని తెలిపింది.