ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్​

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సూసైడ్​

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలో ఏఆర్​ కానిస్టేబుల్​ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వరికోలు గ్రామానికి చెందిన 2020 బ్యాచ్‎కు చెందిన ఏఆర్ ​కానిస్టేబుల్​ అనూష(28) ఐదేండ్లుగా భువనగిరి పోలీస్​హెడ్​క్వార్టర్‎లో పని చేస్తోంది. ఇటీవలే ఆమెకు పెండ్లి నిశ్చయం కాగా, షాపింగ్​కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తన గదిలో ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి డెడ్​బాడీని భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.