ఏఆర్ రెహమాన్కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

ఏఆర్ రెహమాన్కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమన్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే   మార్చి 16న ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇవాళ సాయంత్రం వరకు డాక్టర్లు అతని హెల్త్ గురించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ఏఆర్ రెహమాన్  వ్యక్తిగత విభేదాల కారణంగా 29 ఏళ్ల వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. 2024, నవంబర్ 19 న రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకున్నారు.ఏఆర్ రెహమాన్, సైరా బాను జోడికి 1995లో చెన్నైలో వివాహం జరిగింది. వీరికి ఖతీజా, రహీమా, అమీనా ముగ్గురు పిల్లలు ఉన్నారు.