
ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. 2023 లో తెరకెక్కిన తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 (PS2)లో ఓ పాటకు గాను కాపీరైట్ వివాదం నెలకొంది.
ఈ మూవీలో ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన 'వీర రాజా వీర' పాటపై దాఖలైన కాపీరైట్ ఉల్లంఘనపై కోర్టు విచారణ చేపట్టింది. శుక్రవారం (2025 ఏప్రిల్ 26న) ఢిల్లీ హైకోర్టు సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ మరియు నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పొన్నియిన్ సెల్వన్ -2 మూవీలోని 'వీరా రాజ వీరా' అనే పాటను.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారతీయ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ దాగర్, తన తండ్రి నాసిర్ ఫైయాజుద్దీన్ దాగర్ మరియు మామ జహీరుద్దీన్ దాగర్ స్వరపరిచిన శివస్తుతి పాట నుండి కాపీ చేసినట్లు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ దారుడికి రూ.2కోట్లు ఇవ్వాలని ఏ.ఆర్.రెహమాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను కూడా ఆదేశించింది.
జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ మాట్లాడుతూ.. 'వీర రాజా వీర' పాట కేవలం 'శివ స్తుతి' పాట కంపోజింగ్ ఆధారంగా లేదా ప్రేరణతో రూపొందించబడలేదు. కానీ కొన్ని మార్పులతో వాస్తవానికి దానికి సమానంగా ఉందని తీర్పు చెప్పారు. అందువల్ల, కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో రెహమాన్ మరియు మద్రాస్ టాకీస్ రిజిస్ట్రీలో రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే, రెహమాన్ మరియు మద్రాస్ టాకీస్ మొదట్లో.. ఈ పాటల కంపోజింగ్ సమయంలో జూనియర్ డాగర్ సోదరులకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వలేదని, అందువల్ల ఈ క్రెడిట్‌లను సినిమాలో జోడించాలని చిత్ర నిర్మాతను ఆదేశించింది.