AR Rahman health update: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఏఆర్ రెహ్మాన్.. 

AR Rahman health update: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఏఆర్ రెహ్మాన్.. 

AR Rahman health update: ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ అస్వస్థత కారణంగా మార్చి 16న ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే చికిత్సల అనంతరం ఏఆర్ రెహ్మాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని  రెహ్మాన్ కొడుకు అమీన్ తెలిపాడు. అయితెహ్ చిన్నపాటి అస్వస్థత కారణంగానే ఆస్పత్రికి రావాల్సి వచ్చిందని అంతేతప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. ప్రస్తుతం రెహ్మాన్ ఆరోగ్యం బాగుందని ఎవరూ టెన్షన్ పడద్దని అభిమానులకి సూచించాడు. 

ఇక తమిళనాడు సీఎం  స్టాలిన్ కూడా ఏఆర్ రెహ్మాన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకుని స్పందించారు. ఇందులోభాగంగా ఎప్పటికప్పుడు రెహ్మాన్ హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకుంటున్నానని ప్రస్తుతం రెహ్మాన్ క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రెహ్మాన్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తన్న RC16 (వర్కింగ్ టైటిల్) సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటిఫుల్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ తదితరులు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..