
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా రెహమాన్ ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సైరా రెహమాన్ న్యాయబృందం సోషల్ మీడియా ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అభిమానులకి తెలిపారు.
ఇందులో భాగంగా "“కొన్ని రోజుల క్రితం శ్రీమతి సైరా రెహమాన్ హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరారు. శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన లాస్ ఏంజిల్స్‌లోని స్నేహితులు రసుల్ పూకుట్టి, షాదియా, వందనా షా, మిస్టర్ రెహమాన్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు." 'అంటూ నోట్ విడుదల చేశారు. దీంతో పలువురు అభిమానులు, సన్నిహితులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది సైరా రెహమాన్ తన మాజీ భర్త ఏఆర్ రెహమాన్ తో విడాకులు తీసుకుంది. పెళ్లయి పిల్లలు కలిగిన 29 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఏఆర్ రెహమాన్ యంగ్ గిటార్ ప్లేయర్ తో ప్రేమలో పడ్డాడని అందుకే తన భార్య సైరా కి విడాకులు ఇచ్చాడని పలు పుకార్లు వినిపించాయి.
కానీ ఏఆర్ రెహమాన్ మాత్రం తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కేవలం తమ ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్న RC16 సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.