టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్స్ విన్నర్ ఎఆర్ ఎఆర్ రెహమాన్ ఇటీవలే తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లయిన 28 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకోవడం సంచలనం గా మారింది.
అయితే ఎఆర్ రెహమాన్ సింగర్, గిటార్ ప్లేయర్ మోహిని డే అనే యువతిలో ప్రేమలో ఉన్నాడని అందుకే తన భార్య సైరాభానుకి విడాకులు ఇచ్చాడని పలు వార్తలు బలంగా వైరల్ అవుతున్నాయి. అలాగే మరికొందరు మాత్రం ఎఆర్ రెహమాన్ కుటుంబలో గత కొన్నేళ్లుగా కలహాలు, విభేదాలు మొదలయ్యాయని ఈ కారణంగానే వివాహ బంధానికి గుడ్ బై చెప్పారని ప్రచారాలు చేస్తున్నారు.
దీంతో ఎఆర్ రెహమాన్ ఈ విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని అన్నాడు. అలాగే 24 గంటల్లోగా తనగురించి పబ్లిష్ చేసిన కంటెంట్ ని డిలీట్ చేయాలని లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్, ఫేస్ బుక్ పేజ్ మేనేజర్స్ తదితరులకి లీగల్ నోటీసులు పంపంచినట్లు తెలుస్తోంది.
దీంతో పలువురు అభిమానులు ఎఆర్ రెహమాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సినీ సెలెబ్రటీలకి ప్రవైట్ స్పేస్ ఉంటుందని కానీ కొందరు ఇది అర్థం చేసుకోకుండా వారిగురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలాంటివారికి ఎఆర్ రెహమాన్ సరిగ్గా బుద్ధి చెప్పాడని అంటున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఎఆర్ రెహమాన్ డైవర్స్ పై అడ్వకేట్ వందన షా స్పందించింది. ఇందులో భాగంగా ఏఆర్ రెహమాన్ మోహిని డే తో ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.అలాగే విడాకుల కారణంగా ఇద్దరూ బాధ పడుతున్నారని, కానీ ఈ లవ్ ఎఫైర్ రూమర్స్ మరింత బాధ కలిగిస్తాయని కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని తెలిపింది.
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024