ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (Ar Rahman), తన భార్య సైరా భాను(Saira Bhanu)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన 28 ఏళ్ళ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
అయితే రెహమాన్కి తన అసిస్టెంట్ మోహిని డే (Mohini Dey)అనే సింగర్ తోప్రేమాయణం నడుస్తుందని అందుకే తన భార్యకి విడాకులు ఇచ్చాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే మోహిని డే కూడా రెహమాన్ విడాకులు ప్రకటించిన గంట సేపటి తర్వాత తన భర్త మార్క్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్, మొహాని లవ్ ఎఫైర్ వార్తలు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో తాజాగా రెహమాన్ కొడుకు అమీన్ (AR.Ameen) ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. "తన తండ్రిపై వస్తున్న కొన్ని తప్పుడు వార్తలు చూస్తుంటే చాలా బాధగా ఉంది.. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అలాంటి వారిపై నిరాధారమైన ఆరోపణలు చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. నాన్న ఒక లెజెండ్.. ఎన్నో ఏళ్ల నుంచి అద్భుతమైన మ్యూజిక్‌ను అందించడమే కాదు.. ఎంతో మంది ప్రేమ, అభిమానాలను సొంతం చేసుకున్నారని" దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఇకనైనా ఆపండని.. నిజమేంటో తెలుసుకోవాలని స్టోరీలో రాసుకొచ్చారు రెహమాన్ కొడుకు అమీన్.
Also Read : మ్యూజిక్ చార్ట్‌లను శాసించబోతున్న శ్రీలీల కిస్సిక్ సాంగ్ పాడింది వీళ్లే
ఈ రూమర్స్పై.. రెహమాన్ విడాకుల కేసుని హ్యాండిల్ చేసిన ప్రముఖ అడ్వకేట్ వందన షా స్పందించింది. ఇందులో భాగంగా ఏఆర్ రెహమాన్ మోహిని డే తో ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.అలాగే విడాకుల కారణంగా ఇద్దరూ బాధ పడుతున్నారని, కానీ ఈ లవ్ ఎఫైర్ రూమర్స్ మరింత బాధ కలిగిస్తాయని కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని తెలిపింది.
ఎవరీ మోహిని డే?
మోహిని డే (28years) కోల్‌కతాకు చెందిన ఒక గిటార్ ప్లేయర్. అలాగే నిర్మాత, ప్రొడ్యూసర్, ఫ్యాషన్ డిజైనర్ మరియు వ్యాపారవేత్త కూడా. అయితే, ఈ మోహిని డే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సాంగ్స్కు గిటార్ వాయించే అమ్మాయి. దీంతో ఏఆర్ రెహమాన్ విడాకుల వార్తల వెనుక పెద్ద స్కెచ్ఏ.. ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ కూడా తమ డివోర్స్ పోస్టులో..'తమ ప్రైవసీని గౌరవించండి.. మ్యూచువల్గా డిసైడ్ అయ్యే ఈ నిర్ణయం తీసుకున్నాం' అంటూ వారి వారి పోస్టుల్లో రాసుకొచ్చారు.