ఏఆర్ రెహ్మాన్కు కాబోయే అల్లుడు ఎవరంటే..?

చెన్నై: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కూతురు ఖతిజా రెహ్మాన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. రియాస్ దీన్ షేక్ అహ్మద్ తో తన నిశ్చితార్థం జరిగిందని ఖతిజా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. రియాస్ పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజినీర్ అని కాబోయే భర్త గురించి ఆమె వెల్లడించింది. అందరి ఆశీస్సులతో రియాస్ తో తన ఎంగేజ్ మెంట్ వార్తను ప్రకటించడం సంతోషంగా ఉందని ఖతిజా చెప్పుకొచ్చింది. కాగా, ఏఆర్ రెహ్మాన్, సైనా భాను దంపతులకు ముగ్గురు సంతానం. ఖతిజా, రహీమా, ఏఆర్ అమీన్. వీరిలో ఖతిజా పెద్ద కూతురు. పలు తమిళ చిత్రాల్లో పాటలు పాడటం ద్వారా ఖతిజా మంచి పేరును సంపాదించింది. 

మరిన్ని వార్తల కోసం: 

రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ హఫీజ్

పత్తికి రికార్డు ధర.. క్వింటాలు రూ.9,300

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మృతి