ఏఆర్ రెహమాన్, మోహిని డే పెళ్లిపై స్పందించిన అడ్వకేట్.. ఏమన్నారంటే.?

ఏఆర్ రెహమాన్, మోహిని డే పెళ్లిపై స్పందించిన అడ్వకేట్.. ఏమన్నారంటే.?

Ar Rahman: ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకున్న విషయం ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయిన 28 ఏళ్ళ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 

అయితే రెహమాన్ కి మోహిని డే అనే సింగర్ తోప్రేమాయణం నడుస్తుందని అందుకే తన భార్యకి విడాకులు ఇచ్చాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే మోహిని డే కూడా  రెహమాన్ విడాకులు ప్రకటించిన గంట సేపటి తర్వాత తన భర్త మార్క్ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో  రెహమాన్, మొహాని లవ్ ఎఫైర్ వార్తలు ఎక్కువయ్యాయి. 

దీంతో ఈ విషయంపై  రెహమాన్ విడాకుల కేసుని హ్యాండిల్ చేసిన ప్రముఖ అడ్వకేట్ వందన షా స్పందించింది. ఇందులో భాగంగా   ఏఆర్ రెహమాన్ మోహిని డే తో ప్రేమలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.అలాగే విడాకుల కారణంగా ఇద్దరూ బాధ పడుతున్నారని, కానీ ఈ లవ్ ఎఫైర్ రూమర్స్ మరింత బాధ కలిగిస్తాయని కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని తెలిపింది. 

ALSO READ | Mohini Dey: 28 ఏళ్ల అసిస్టెంట్‌తో ఏఆర్ రెహమాన్ ఎఫైర్!.. ఎవరీ మోహిని డే..?

అలాగే భవిష్యత్ లో  ఏఆర్ రెహమాన్ మరియు మొహిన్ డే పెళ్లి చేసుకోబోతున్నారా అని రిపోర్టర్ అడగ్గా "నో కామెంట్స్" అని సమాధానం ఇచ్చింది.ఈ విషయం ఇలా ఉండగా  ఏఆర్ రెహమాన్ సైరా  భాను వివాహం 1995 లో జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గరు సంతానం. 

అయితే ఈ ఏడాది  ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా తన భార్య సైంధవితో విడాకులు  తీసుకున్నట్లు ప్రకటించాడు.