విజిలెన్స్‌‌ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌గా ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌

విజిలెన్స్‌‌ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌గా ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టర్‌‌‌‌గా రిటైర్డ్ ఐపీఎస్‌‌ ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ నియమితులయ్యారు. ఈ మేరకు  సీఎస్‌‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు డైరెక్టర్ హోదాలో ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 

ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్ గతంలో ఏసీబీ డైరెక్టర్‌‌‌‌గా, హైదరాబాద్‌‌ అడిషనల్‌‌ సీపీ(క్రైమ్స్‌‌,సిట్‌‌)గా,వెస్ట్‌‌జోన్‌‌ డీసీపీ సహా కీలక విభాగాల్లో విధులు నిర్వహించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపారు.