గల్ఫ్​ దేశాలకు పరీక్షే!

గల్ఫ్​ దేశాలకు  పరీక్షే!

ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి. క్లైమేట్​ ఛేంజ్​ ఎఫెక్ట్​లను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి. కార్బన్ ఎమిషన్స్​ తగ్గింపు చర్యలు చేపడుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​ వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని వాడనున్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నామంటే… ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఈ మార్పులన్నీ గ్లోబల్​ ఆయిల్ డిమాండ్​పై బాగా ప్రభావం చూపనున్నాయి. దీంతో ఆదాయం కోసం ఇన్నాళ్లూ ఆయిల్​పైనే ఆధారపడ్డ గల్ఫ్​ దేశాలు సంస్కరణల బాటలోకి వెళ్లి తీరాలి. లేదా… ఇరవై ఏళ్ల తర్వాత గరీబు కానున్నాయని ఐఎంఎఫ్​ హెచ్చరిస్తోంది

 

డాయిల్​ కురిపిస్తున్న కాసుల వర్షంలో తడిసి ముద్దవుతున్న గల్ఫ్​ దేశాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజులు రానున్నాయి. ఫ్యూయల్​కి మహా అయితే మరో ఇరవై ఏళ్ల దాకే గిరాకీ ఉంటుందని, తర్వాత తగ్గుతుందో పెరుగుతుందో చెప్పలేమని అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ఆయిల్​ డిమాండ్​ పడిపోతే గల్ఫ్​ దేశాలకు డబ్బులు దొరకని పరిస్థితులు తలెత్తొచ్చని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​(ఐఎంఎఫ్​) అంచనా వేస్తోంది. దీంతో గల్ఫ్​ కోపరేషన్​ కౌన్సిల్​(జీసీసీ)లోని ఆరు దేశాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.

2034 నాటికి మిడిల్​ ఈస్ట్రన్​ దేశాలు సంపద హరించుకుపోయి అప్పుల్లో ఇరుక్కుంటాయని ఐఎంఎఫ్​ లేటెస్ట్​ రిపోర్ట్​ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆపైన పదేళ్లలో అంటే దాదాపుగా 2045 కల్లా ఆయిల్​తో సంబంధంలేని ఇతర సంపద కూడా తగ్గిపోతుందని పేర్కొంది. ఈ రిపోర్టును ఐఎంఎఫ్​ మిడిల్​ ఈస్ట్​ టీమ్, సెంట్రల్​ ఆసియా స్పెషలిస్టులు, రీసెర్చ్​ డిపార్టుమెంట్ కలిసి రూపొందించాయి. అయితే.. ఈ సూచనను ఇప్పటికే గల్ఫ్​లోని కొన్ని దేశాలు పసిగట్టాయి. ఆయా దేశాల్లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి.

డిమాండ్​–సప్లై మారుతోంది

ఆయిల్​ డిమాండ్​, సప్లయి విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గల్ఫ్​ చమురు ఉత్పాదక దేశాలు చాలా ముందు చూపుతో కొన్ని చర్యలు తీసుకున్నాయి. కాకపోతే అవి మరింత ఊపందుకోవాల్సిన అవసరం ఉందని ఆయిల్​ ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్​లు, ఎకనమిస్టులు తేల్చిచెబుతున్నారు. ఇందుకోసం ఈ ప్రాంత​ దేశాలు వ్యూహాత్మకంగా లాంగ్​టర్మ్ ప్లాన్లను పక్కాగా అమలు చేయాలంటున్నారు.

ఇంటర్నేషనల్​ ఆయిల్​ కంపెనీలు, ఉత్పత్తి దేశాలు చమురు కాకుండా వేరే ఎనర్జీ సోర్సులను గుర్తించాలి. ఈ దిశగా సౌదీ అరేబియా, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ కొత్త ఇండస్ట్రీలను డెవలప్​ చేస్తున్నాయి. అయితే, చేతిలో సొమ్ములు పూర్తిగా ఆవిరయ్యే లోపు వాటి నుంచి ఆదాయం వస్తుండాలి. అందుకు తగినంత వేగంగా నాన్​–ఆయిల్​ రెవెన్యూ పథకాల్ని అమలు చేయట్లేదనే అసంతృప్తి నెలకొంది. ఖర్చుల్లో కోత పెట్టడం, పొదుపు పెంచుకోవటం, కొత్త పన్నులు వసూలు చేయటం వంటి చర్యలను ఆశించినంతగా చేపట్టట్లేదని ఐఎంఎఫ్​ తన రిపోర్ట్​లో తప్పు పట్టింది.

ఈ ఏడాది ఆయిల్ రేట్లు తగ్గటం, దేశాల మధ్య గొడవలు జరగటం, కరోనా వైరస్​ వంటి అనుకోనివి చోటు చేసుకోవటంతో గల్ఫ్​ దేశాల ఖజానాలు ఖాళీ అవటం మొదలైంది. ఇవన్నీ ఆ దేశాలు ముందు ముందు0 ఎదుర్కోవాల్సిన ప్రమాదాలకు సూచనలు. గ్లోబల్​ ఆయిల్​ డిమాండ్​ 2041 నాటికి పీక్​ స్టేజ్​కి చేరుతుందని, రోజుకు 11 కోట్ల 50 లక్షల బ్యారెళ్ల ఇంధనం వాడతారని ఐఎంఎఫ్ చెబుతోంది. అయితే, ఆ తర్వాత చమురుకి గిరాకీ క్రమంగా తగ్గి కొన్నాళ్లలోనే పర్మనెంట్​గా పడిపోతుందని అంటోంది.

ఆయిల్​ డిమాండ్​ 2035 నాటికి ఓ రేంజ్​కి చేరుతుందని ఐహెచ్​ఎస్​ మార్కిట్​ లిమిటెడ్​ అనే ఆయిల్​ ఇండస్ట్రీ కన్సల్టెంట్​ పోయినేడాదే చెప్పింది. ఒకవేళ వివిధ దేశాలు కార్బన్​ ట్యాక్స్​లను ప్రవేశపెడితే ఆ గిరాకీ కాస్తా ఐదేళ్ల ముందే దిగజారుతుందని కూడా తేల్చేసింది. పెట్రోకెమికల్స్​లో ఆయిల్​ వాడకం పెరిగితే డిమాండ్​ మరింత పడిపోకుండా ఆగుతుందని ఐఎంఎఫ్​ భావిస్తోంది. ఇంధనం వాడకం పెరిగినా పోటీ దేశాల్లో ప్రొడక్షన్​ కాస్ట్​ తక్కువ కావటం వల్ల గల్ఫ్​ దేశాలు తమ మార్కెట్​ను కోల్పోతాయంటూ మరో బాంబ్​ పేల్చింది.

అప్పుల తిప్పలు తప్పవు

గల్ఫ్​ కోపరేషన్​ కౌన్సిల్​ (జీసీసీ)లో అతి పెద్ద ఆయిల్​ ఉత్పత్తి దేశాలు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్. ఇవి ఒపెక్​ మెంబర్లు కూడా. అయితే భవిష్యత్​లో ఫ్యూయల్​ రెవెన్యూ తగ్గుముఖం పట్టే విషయంలో ఒక్కో దేశానిది ఒక్కో ఇబ్బంది. జీసీసీలోని మరో మూడు దేశాలు ఖతార్, ఒమన్, బహ్రెయిన్​లదీ ఇదే పరిస్థితి. ఈ దేశాలకు రాబడి తగ్గటం వల్ల ఖర్చుల కోసం చివరికి అప్పులు కూడా తీసుకోక తప్పదని ఐఎంఎఫ్​ కుండబద్ధలు కొట్టింది. ఇది తప్పించుకోవాలంటే ప్రైవేట్​కు పెద్ద పీట వేయాలని ఐఎంఎఫ్​ మిడిల్​ ఈస్ట్​ డిపార్ట్​మెంట్​ డైరెక్టర్ జిహాద్​ అజౌర్ అన్నారు.

లక్షల కోట్లు ఆవిరే

ప్రపంచంలోని మొత్తం క్రూడాయిల్​ ప్రొడక్షన్​లో ఐదులో ఒకటో వంతు వాటా ఈ ఆరు దేశాలదే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ బాగా డబ్బు చేసి ఉన్న గల్ఫ్​ దేశాల ఎకానమీ వచ్చే 15–20 ఏళ్లలో తారుమారు కానుందని ఐఎంఎఫ్​ చెబుతోంది. 2034 నాటికి పర్షియన్​ గల్ఫ్​లోని అరబ్ మోనార్క్​ల సంపద రెండు లక్షల కోట్ల డాలర్ల వరకు (రూపాయల్లో కోటీ 42 లక్షల కోట్లు) తగ్గిపోనుందని లెక్కలేసింది. అందువల్ల ఆయిల్​ వాడకంలో జరిగే మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పట్నుంచే ఆర్థిక సంస్కరణలకు సిద్ధం కావాలని సూచిస్తోంది.

ప్రైవేట్​ సెక్టార్​ని ఎంకరేజ్​ చేయాలి

గల్ఫ్ దేశాలు మరో రెం డు దశాబ్దాల తర్వాత కూడా ఆర్థికంగా ని లదొక్కుకోవాలంటే ఖర్చు లను, ఉద్యో గ కల్పనను ప్రభుత్వ రంగం నుం చి ప్రైవేట్ సెక్టార్ కి మార్చుకో వాలి. నాన్ –ఆయిల్ రాబడి మార్గాలను డెవలప్ చేయాలి. ఇప్పుడున్న సంపదను కాపాడుకోవటానికి ఫైనాన్షియల్ ట్రాన్స్ ఫార్మేషన్ విష యంలో దూకుడుగా వ్యవహరించాలి. సంస్కరణలను వేగవంతం చేయకుండా ఇక చాల్లే అనుకుంటే భవిష్య త్ లో ఇన్ కం వచ్చే దార్లన్నీ మూసుకుపోతాయి.

వారి సంపద వేల కోట్లలోనే..

మిడిల్​ ఈస్ట్​లో ఏడు ప్రధాన దేశాలుండగా, వాటిలో అరబ్​ ఎమిరేట్స్​ (యూఏఈ) కింద మరో ఏడు రాజ్యాలున్నాయి. ఇవన్నీ సుల్తాన్ల పాలనలో నడుస్తున్నాయి. ఈ దేశాలన్నింటికీ ఆయిల్​ ద్వారానే పెద్ద రాబడి వస్తుంది. ఈమధ్యనే రియల్​ ఎస్టేట్​, అరేబియన్​ గుర్రాల బ్రీడింగ్​ వంటి రంగాల్లోకి వెళ్తున్నారు. వీళ్లలో బాగా సంపదకలిగినవాళ్ల వివరాలు :

యూఏఈ ప్రెసిడెంట్​ షేక్​ ఖలీఫా బిన్​ జాయేద్: గల్ఫ్​ దేశాల్లో యూఏఈ ప్రెసిడెంట్​ షేక్​ జాయేద్​ సంపన్నవంతుడు. దాదాపు 2300 కోట్ల డాలర్లు (రూపాయల్లో దాదాపు లక్షా 61 వేల కోట్లు) ఉన్నట్లు అంచనా. ఆయిల్​తో పాటు రియల్​ ఎస్టేట్​ రంగంలోనూ బాగా సంపాదిస్తున్నారు.

సౌదీ అరేబియా రాజు సల్మాన్​ : గల్ఫ్​లో 2100 కోట్ల డాలర్ల సంపన్నవంతుడు. మొత్తం సౌదీ అరేబియా రాయల్​ ఫ్యామిలీ ఆస్లి రెండు లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా.  ఈ దేశానికి రోజుకు 100 కోట్ల డాలర్ల వరకు రాబడి వస్తుంది. ఆయిల్​తో పాటు అరేబియన్​ గుర్రాల బ్రీడింగ్​ సెంటర్​ ద్వారాకూడా పెద్ద మొత్తంలో రాబడి ఉంది.

దుబాయి షేక్​ మహ్మద్​ బిన్​ రషీద్​ : గల్ఫ్​లో 1800 కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. దుబాయి హోల్డింగ్​లో ప్రధాన షేర్​ హోల్డర్​. దీనిద్వారా రియల్​ఎస్టేట్​ రంగంలోనూ పెట్టుబడులు పెడుతుంటారు. న్యూయార్క్​లోని ఎస్సెక్స్​ హౌస్​ హోటల్​లోనూ పెట్టుబడులున్నాయి. ఆస్ట్రేలియాలోని ఇంఘమ్​ స్టడ్​ ఫార్మ్​లో గుర్రాల బ్రీడింగ్​ జరుగుతోంది. దీని విలువ సుమారుగా 46 కోట్ల డాలర్లుంటుంది.

ఖతార్​ షేక్​ హమద్​ బిన్​ ఖలీఫా అల్​ థాని : ఈయన ఆస్తి 200 కోట్ల డాలర్లు. ఆయిల్​, నేచురల్​ గ్యాస్​ నిల్వలు దండిగా ఉన్నాయి.

ఒమన్​ సుల్తాన్​ ఖబూస్​ బిన్​ సయద్​ : ఆస్తి రీత్యా చూస్తే కేవలం 110 కోట్ల డాలర్లే ఉన్నప్పటికీ, చాలా సంస్థలకు దానధర్మాలు చేయడంద్వారా మంచి పేరు సాధిస్తున్నారు. మసీదులకు బాగా సాయం చేస్తుంటారు. ః