మా క్యాస్ట్ పేరు మార్చొద్దు ..బీసీ కమిషన్​ను కోరిన ఆరెకటిక నేతలు

మా క్యాస్ట్ పేరు మార్చొద్దు ..బీసీ కమిషన్​ను కోరిన ఆరెకటిక నేతలు

హైదరాబాద్, వెలుగు: తమ కులం ఆరెకటిక పేరును అలాగే కొనసాగించాలని ఆ కుల ప్రతినిధులు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్​ను కోరారు. సోమవారం బీసీ కమిషన్ ముందు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.  రాష్ట్రంలో ఉన్న వివిధ కబేళాలను వేలం ద్వారా ఆరకటికేతరులకు ఇవ్వడంతో తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని ప్రతినిధులు తెలిపారు. 

ఆ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న వారు ప్రతి మేకను కోయడానికి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీల వారు ఆరెకటికలతో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, వారు చెప్పిన ధరకే మాంసం అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఇతర కులాల వారికి కల్పిస్తున్న సౌకర్యాలను ఆరెకటికలకు కూడా కల్పించాలని, ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.