
ఆంధ్రప్రదేశ్ అరకు నియోజకవర్గానికి చెందిన ఎంపీ గొడ్డెట్టి మాధవి త్వరలో పెండ్లిపీటలు ఎక్కనున్నారు. వీరు వైసీపీ తరపున 2019ఎన్నికలలో పోటీచేసి ఎంపీగా గెలిచారు. మాధవి తండ్రి గడ్డేటి దేముడు ఎమ్మెల్యేగా పనిచేశారు. మాధవి పెండ్లి తన సొంత గ్రామమైన శరభన్న పాలెంలో జరుగనుంది. తన చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ ను ఆమె పెండ్లి చేసుకోనున్నారు. విశాఖలోని రిషికొండబీచ్.. సాయిప్రియ రిసార్ట్స్ లో ఈనెల 22న రిసెప్షన్ జరుగనుంది. వరుడు శివప్రసాద్ ఓ కాలేజ్ ను నడుపుతున్నారు. అతిచిన్న వయసులోనే మాధవి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఎంపీగా గెలిచిన నాటికి ఆమె వయసు 25సంవత్సరాలు.