ఆరామ్ సే పోవచ్చు..రావచ్చు..ఆరాంఘర్ ఫ్లై ఓవర్ రెడీ

ఆరామ్ సే పోవచ్చు..రావచ్చు..ఆరాంఘర్ ఫ్లై ఓవర్ రెడీ
  • ఆరాంఘర్ ఫ్లై ఓవర్ రెడీ
  • 10 రోజుల్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి


హైదరాబాద్ సిటీ, వెలుగు:నగరంలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్‌‌‌‌‌‌‌‌ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నాయి. డిసెంబర్​మొదటి వారంలో సీఎం రేవంత్​రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్​పనులు 2021లో ప్రారంభం కాగా, గతేడాది నుంచి స్పీడప్​చేశారు. అంచనా వ్యయం రూ.636.80 కోట్లు కాగా, పూర్తయ్యే సరికి రూ.736 కోట్లకు చేరింది. 

జర్నీ ఇక ఈజీ..

ఆరాంఘర్ నుంచి జూపార్క్‌‌‌‌‌‌‌‌ వరకు 24 మీటర్ల వెడల్పు, 4.08 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్లతో నిర్మించారు. అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు వెళ్లేవారికి ట్రాఫిక్​ఇబ్బందులు తప్పుతాయి. తాడ్​బన్, దానమ్మ హట్స్, హసన్ నగర్ జంక్షన్లలోని ట్రాఫిక్ ​సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన పనిలేదు. జూపార్క్‌‌‌‌‌‌‌‌కు వచ్చే సందర్శకులు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవుతుంది. 

Also Read:-టెలిగ్రాంలో చైల్డ్‌‌ పోర్న్‌‌ వీడియోస్‌‌...

ప్రత్యేక రాష్ట్రంలో పొడవైన ఫ్లైఓవర్ 

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటీలో నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్ ఇదే కానున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహరావు ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ వే 2009లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ దేశంలోనే నెంబర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో ఎయిర్ పోర్టుకు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. నేటికీ ఫోర్ వీలర్స్ కు మాత్రమే అనుమతి ఉంది. హెవీ వెహికల్స్, టూవీలర్స్, ఆటోలకు పర్మిషన్​లేదు. ఆ తర్వాత కొత్తగూడ ఫ్లైఓవర్ ను 3 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మించారు. 
అతిత్వరలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లలో అందుబాటులోకి రానుంది. ఇది నగరంలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ స్థానాన్ని దక్కించుకోనుంది. ఫ్లైఓవర్ పనులను హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి బల్దియా కమిషనర్ ఇలంబరితి మంగళవారం పరిశీలించారు. నాలుగు రోజుల్లో అన్ని పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి 17 ఆస్తులు సేకరించాలని, ప్రస్తుతం పని జరిగేందుకు 5 ఆస్తులు వెంటనే సేకరిస్తే సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని చీఫ్ ఇంజనీర్ దేవానంద్ కమిషనర్ కు వివరించారు. నష్టపరిహారం చెల్లించేందుకు ప్రతిపాదనలను పంపిస్తే, మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 


నగరంలోని పలు ఫ్లైఓవర్ల పొడవు

ఫ్లైఓవర్​పేరు..                                      కి.మీ.        లేన్లు


పీవీ నరసింహారావు ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ వే        11.66           4
ఆరాంఘర్ ఫ్లైఓవర్                              4.08            6
కొత్తగూడ ఫ్లైఓవర్                                 3.00            4 
షేక్‌‌‌‌‌‌‌‌పేట ఫ్లైఓవర్                                 2.71            6
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్                      1.75           4
ఒవైసీ మిథాని ఫ్లైఓవర్                         1.40          3
బాలాన‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌ర్ ఫ్లైఓవ‌‌‌‌‌‌‌‌ర్                               1.13         6