Aranmanai 4 OTT Official: ఓటీటీకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aranmanai 4 OTT Official: ఓటీటీకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తమిళ ఇండస్ట్రీలో ఆర్నామానై(Aranmanai ) సిరీస్ కు మంచి ఆధరణ ఉంది. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చే ఈ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సిరీస్ లో నాలుగవ సినిమాగా ఇటీవలే బాక్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నా, యోగిబాబు, వెన్నెల కిశోర్ తదితరులు కీ రోల్స్ చేశారు. 

టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఐపీఎల్, ఎలక్షన్స్ కారణంగా ఈ సినిమాకు అంతగా ఆదరణ ఉందని చాలా మంది అనుకున్నారు. కానీ, వాటన్నిటినీ దాటి సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. 

ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాక్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సంస్థ జూన్ 21 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో అనూహ్య విజయం సాధించిన బాక్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.