Muthayya Movie: సమంత చేతుల మీదుగా.. అరవైల పడుసోడు.. ఇరవైల ముసలోడు పాట

Muthayya Movie: సమంత చేతుల మీదుగా.. అరవైల పడుసోడు.. ఇరవైల ముసలోడు పాట

‘బలగం’ఫేమ్ సుధాకర్ రెడ్డి లీడ్‌‌ రోల్‌‌లో నటించిన చిత్రం ‘ముత్తయ్య’.అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. భాస్కర్ మౌర్య దర్శకుడు.

వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. డీవోపీ దివాకర్ మణి కో ప్రొడ్యూసర్‌‌‌‌. త్వరలో ఇది ఈటీవీ విన్‌‌లో ప్రీమియర్ కాబోతోంది. గురువారం ఈ చిత్రం నుంచి ‘అరవైల పడుసోడు’అనే పాటను హీరోయిన్‌‌ సమంత విడుదల చేసి బెస్ట్ విషెస్‌‌ చెప్పింది.

ముత్తయ్య క్యారెక్టరైజేషన్‌‌ తెలియజేస్తూ సాగే ఈ పాటను కార్తీక్ రోడ్రిగ్వ్‌‌ కంపోజ్ చేయగా విద్యాసాగర్ బంకుపల్లి పాడాడు.  ‘అరవైల పడుసోడు ఎగిరెగిరి పడతాడు.. తుమ్మాకో తంబాకో తెలవదులేండి.. ఇరవైల ముసలోడు ఎవ్వనికీ ఇనడీడు తుండేసి బండేసె ఆగం సుండి.. ఎర్రి సోమరికాడు ఎడ్డి కొండడుకాడు.. జర్ర కిర్రాకు జేస్తాడు మట్టున జూడు... మల్లీ సోపతిగాడు ఈడో ఎచ్చులపోడు..’ అంటూ శివకృష్ణ చారి ఎర్రోజు రాసిన క్యాచీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి.