ఈ సీజన్ వేలంలో తెలంగాణ నుంచి ఇద్దరికి చాన్స్ లభించింది. హెచ్‌సీఏకు ఆడుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరవెల్లి అవనీశ్ రావు రూ. 20 లక్షల ప్రారంభ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల అండర్19 ఆసియా కప్‌లో ఆడిన 18 ఏండ్ల కీపర్ అవనీశ్ వచ్చే నెలలో సౌతాఫ్రికాలో జరిగే అండర్19 వరల్డ్ కప్‌నకు కూడా ఎంపికయ్యాడు.
సీఎస్కే టీమ్‌లో కెప్టెన్ ధోనీకి అవనీశ్ బ్యాకప్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన 28 ఏండ్ల స్పిన్ ఆల్‌రౌండర్ తనయ్ త్యాగరాజన్ రూ. 20 లక్షలకు పంజాబ్ టీమ్‌లో చేరాడు.