గుర్తుండిపోయే మాస్టర్ పీస్

గుర్తుండిపోయే మాస్టర్ పీస్

అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి  ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్‌‌‌‌‌‌‌‌’. శుక్ర, మాటరాని మౌనమిది లాంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ తెరకెక్కిస్తున్నాడు.  శ్రీకాంత్ కాండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు.  ఈ సందర్భంగా అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ఇదొక సూపర్ హీరో మూవీ. మా టీమ్ అంతా గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది’  అని చెప్పాడు.  ఈ చిత్రంతో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌కు పరిచయమవడం ఆనందంగా ఉందని చెప్పింది జ్యోతి.

దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం.  పురాణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో ఈ మూవీ తీశా.  మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. త్వరలో షూటింగ్ పూర్తి చేసి, రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తాం’ అని చెప్పాడు. మా అందరి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది అని నిర్మాతలు అన్నారు.