కైరో: భారీ వర్షాల కారణంగా సూడాన్‌లోని రెడ్ సీ కోస్టల్ స్టేట్‌లో ఉన్న అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుమారు 60 మంది వరకు మరణించి ఉండవచ్చని, అనేక మంది గల్లంతైనట్లు సూడాన్ వార్తా చానెల్ పేర్కొంది. డ్యామ్ సమీప గ్రామాల్లోకి భారీగా వరద చేరిందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించింది.
మొత్తంగా ఈ ఘటనలో నష్టం తీవ్ర స్థాయిలో ఉందని అధికారులు వెల్లడించారు. మొబైల్ నెట్ వర్క్ పనిచేయకపోవడంతో కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. లోతట్టు ఏరియాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం భద్రతా బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. వరదలతో రెడ్ సీ స్టేట్ లో పవర్ సప్లై ఆగిపోయింది. తాగు నీరు కూడా దొరకం లేదు.