
సిద్దిపేట రూరల్, వెలుగు: 1100 ఏళ్లనాటి 9 అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంగునూరు మండల కేంద్రంలోని చిన్న కొండపైన ఉన్న విగ్రహాన్ని పరిశీలించారు.
కొండకు దిగువన చుట్టూ ఉన్న ఇటుకరాతి శకలాలు, తుప్పల్లో ఒకరాతి స్తంభంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న మహావీరుడి శిల్పం, ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలు పూర్వం ఇక్కడ జైనబసది ఉండేదని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అహోబిలం కరుణాకర్, పవన్, శిల్పి బి.సుధాకర్ సింగ్ పాల్గొన్నారు