నేషనల్ బెస్ట్​ టీచర్​గా అర్చన

దండేపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్​టీచర్​ఎన్.అర్చన నేషనల్​బెస్ట్ టీచర్​గా ఎంపికయ్యారు. 

సెప్టెంబర్ 5న టీచర్స్​డే సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు.  స్టూడెంట్ల సంఖ్యను 30 మంది నుంచి 250 మందికి పెంచడంలో ఆమె కృషిని గుర్తించిన ప్రభుత్వం ఆమెను నేషనల్​అవార్డుతో  గౌరవించనుంది. అర్చన బెస్ట్​ టీచర్​ అవార్డుకు సెలెక్ట్​ కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.