- గురి కుదరాలె.. నేటి నుంచే ఆర్చరీ పోటీలు
పారిస్: ఒలింపిక్స్ అధికారికంగా మొదలవ్వడానికి ముందే ఇండియా ఆర్చర్లు తమ వేట మొదలుపెట్టనున్నారు. గురువారం జరిగే క్వాలిఫికేషన్స్ రౌండ్స్‌లో బరిలోకి దిగనున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత ఇండియా నుంచి తొలిసారి ఆరుగురితో కూడిన జట్టు బరిలోకి దిగుతోంది. ర్యాంకింగ్స్ ఆధారంగా మెన్స్, విమెన్స్‌లో చెరో ముగ్గురు ఆర్చరీ పోటీలకు క్వాలిఫై అయ్యారు.
దీంతో ఐదు ఈవెంట్లలో వీళ్లంతా పోటీపడనున్నారు. వెటరన్స్ తరుణ్‌దీప్ రాయ్, దీపిక కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మిగతా వాళ్లు పతక బోణీ కోసం ఆరాటపడుతున్నారు. క్వాలిఫికేషన్‌లో టాప్–10లో ఉంటే మంచి డ్రా పడే చాన్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 53 దేశాల నుంచి 128 మంది ఆర్చర్లు బరిలోకి దిగుతున్నారు. ఒక్కో ఆర్చర్‌కు 72 బాణాలు ఇస్తారు. ఇందులో మెరుగైన పెర్ఫామెన్స్ చేసిన వారు నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఆదివారం విమెన్స్, సోమవారం మెన్స్ టీమ్ మెడల్ పోటీలు జరుగుతాయి.
మంగళవారం నుంచి ఇండివిడ్యువల్ పతక పోరు, శుక్రవారం మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్, ఈ వారాంతంలో విమెన్స్, ఇండివిడ్యువల్ ఫైనల్స్ ఉంటాయి. కాగా, సీడింగ్‌లో ఎప్పుడూ వెనకబడే మన ఆర్చర్లకు క్వాలిఫయింగ్ రౌండ్స్ కీలకం కానున్నాయి.
ఒలింపిక్స్‌లో నేడు ఇండియా పోటీలు
ఆర్చరీ విమెన్స్ ఇండివిడ్యువల్ ర్యాంకింగ్స్ రౌండ్
(దీపిక, అంకిత, భజన్ కౌర్)– మ. 1 నుంచి
మెన్స్ ఇండివిడ్యువల్ ర్యాంకింగ్స్ రౌండ్
(ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్)– సా. 5.45 నుంచి
స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్