ఆర్కిటెక్ట్‌‌‌‌ అద్భుతాలు!

ఆర్కిటెక్ట్‌‌‌‌ అద్భుతాలు!

అవార్డులు గెలిచిన వైల్డ్‌‌‌‌ లైఫ్​, ప్రకృతి అందాల ఫొటోలను రెగ్యులర్​గా​ చూస్తుంటాం. కానీ.. ఇవి ఆర్కిటెక్చర్ విభాగంలో పోటీలకు ఎంపికైనవి. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు సోనీ అవార్డులు అందిస్తోంది. ఆర్కిటెక్చర్, ల్యాండ్‌‌‌‌స్కేప్, ట్రావెల్, స్ట్రీట్ ఫొటోగ్రఫీతో సహా 10 విభాగాల్లో పోటీలు ఉంటాయి. ఇందులో గెలిచిన వాళ్లకు ఓపెన్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌‌‌‌ ఇస్తారు. ఈసారి పోటీలకు అన్ని విభాగాల్లో ప్రపంచం నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో చైనీస్ ఫొటోగ్రాఫర్ జుచెంగ్ లియు మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.