తొలి రౌండ్‌‌‌‌లో సింధుకు నిరాశ

వాంటా (ఫిన్లాండ్‌‌‌‌) :  పారిస్ ఒలింపిక్స్‌‌‌‌ తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశ పరిచింది. ఆర్సిటిక్‌‌‌‌ ఓపెన్ సూపర్‌‌‌‌‌‌‌‌ 500 ఈవెంట్‌‌‌‌లో తొలి రౌండ్‌‌‌‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్ మ్యాచ్‌‌‌‌లో సింధు 16–21, 10–21తో వరుస గేమ్స్‌‌‌‌లో కెనడాకు చెందిన మిషెల్లీ లీ చేతిలో పరాజయం పాలైంది. 

మరో మ్యాచ్‌‌‌‌లో మాళవిక బన్సొద్ 21–19, 24–22తో 23వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ సంగ్‌‌‌‌ షువొ యున్‌‌‌‌ (తైవాన్‌‌‌‌)కు షాకిచ్చి ప్రి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మరో ఇండియన్ ఆకర్షి కశ్యప్ 21–19, 21–14తో జర్మనీ షట్లర్ వైవోన్‌‌‌‌పై గెలిచింది.