హోలీ తర్వాత చర్మంపై దురద, ర్యాషెస్ వచ్చాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి...

హోలీ తర్వాత చర్మంపై దురద, ర్యాషెస్ వచ్చాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి...

హోలీ పండుగ రోజు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు రంగులు చల్లుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు. న్యాచురల్ కలర్స్ తో సెలెబ్రేట్ చేసుకున్నోళ్ళు మరుసటిరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ రొటీన్ లైఫ్ స్టార్ట్ చేశారు. అయితే.. కెమికల్స్ కలిసిన ఆర్టిఫీషియల్ కలర్స్ తో హోలీ సెలెబ్రేట్ చేసుకున్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హోలీ మరుసటిరోజు నుంచి చాలామంది చర్మం మీద ర్యాషెస్ తో, బురదతో ఇబ్బంది పడుతున్నారు.

దీనికి కారణం కలర్స్ లో కలిసిన కెమికల్స్. ఈ ర్యాషెస్ తగ్గాలంటే కచ్చితంగా డాక్టర్ ని కలిసి మందులు తీసుకోవాల్సిందే. అయితే.. డాక్టర్ ని కలిసే బదులు చిన్న చిన్న రెమిడీస్ ట్రై చేస్తే ఇంట్లో ఉండే ర్యాషెస్, దురద నుంచి ఉపశమనం పొందొచ్చు.

పసుపు, పాలతో చర్మాన్ని క్లీన్ చేయండి:

కెమికల్స్ తో తయారు చేసిన కలర్స్ వాటర్ తో ఎంత క్లీన్ చేసినా పోవు.. పైగా వాటివల్ల చర్మంపై ర్యాషెస్ కూడా వస్తాయి. ఈ కలర్స్ క్లీన్ అయ్యి ర్యాషెస్ నుండి ఉపశమనం పొందాలంటే చర్మాన్ని పాలు, పసుపు, శనగపిండితో క్లీన్ చేస్తే కలర్స్ క్లీన్ అయ్యి ర్యాషెస్, దురద నుంచి ఉపశమనం పొందొచ్చు.

మాయిశ్చరైజర్ వాడండి:

హోలీ రంగుల వల్ల చర్మంపై వచ్చిన ర్యాషెస్,దురద తగ్గాలంటే మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మంపై తేమ పోకుండా.. స్కిన్ హెల్తీగా ఉంటుంది. 

అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది:

సింథటిక్ కలర్స్ వల్ల చర్మంపై వచ్చిన ర్యాషెస్, దురద తగ్గాలంటే అలోవెరా జెల్, తేనే వాడితే మంచిది. వీటి వల్ల స్కిన్ రీహైడ్రేట్ అయ్యి హెల్దీగా ఉంటుంది.

కొద్దిరోజులు మేకప్ కి దూరంగా ఉండాలి:

సింథటిక్ కలర్స్ వల్ల ఎఫెక్ట్ అయిన చర్మం కోలుకోవాలంటే.. కొద్దిరోజులు మేకప్ కి దూరంగా ఉండాలని నిపుణులు సలహా. మేకప్ వల్ల చర్మంపై ర్యాషెస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిరోజులు మేకప్ వాడకుండా ఉంటే మంచిది. ఎక్కువగా బయట తిరగకుండా.. నీళ్లు ఎక్కువ తాగితే స్కిన్ రీహైడ్రేట్ అవుతుంది. 

సీటీఎం టెక్నీక్ ఫాలో అవ్వండి:

సీటీఎం అంటే క్లేన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్.. చర్మాన్ని రెగ్యులర్ గా రోజ్ వాటర్, మిల్క్ తో క్లీన్ చేయడం, ప్రతిరోజూ టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయడం వల్ల ర్యాషెస్ నుండి స్కిన్ ని కాపాడుకోవచ్చు. 

Also Read:-నిద్రలేమి సమస్య ఉందా..? క్యాన్సర్,గుండెపోటు వచ్చే ప్రమాదం!