
ఎండాకాలం వచ్చేస్తోంది. ఇంట్లో ఉక్కపోత.. బయట చల్లగాలికి వడుకుందామంటే దోమల బెడద. పైగా ఈ దోమలు కుడితే మంట ఒక్కటే కాదు.. దాంతోపాటు రకరకాల జబ్బులు కూడా వచ్చేస్తాయి. అందుకే దోమలు కుట్టకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాయిల్స్, స్ప్రేలు, లిక్విడ్స్, రెపెల్లెంట్స్ ఇలా ఎన్నో వాడతారు. అయితే ఇవి వాడడం ఎంతవరకు సేఫ్?
పిల్లలు నిద్దట్లో కూడా దుప్పటిని ఎతన్నేస్తుంటారు. దోమలు కుట్టకుండా నిండా కప్పుకోవడం పిల్లలకు ఇష్టం ఉండదు. దీంతో కప్పినా కూడా వెంటనే తీసేస్తుంటారు. దీంతో పిల్లలను దోమల నుంచి కాపాడేందుకు రకరకాల క్రీమ్స్ రాస్తుంటారు. మరి ఈ క్రీమ్స్ రాయడం మంచిదేనా? కాయిల్స్, స్ప్రేలు, రెపెల్లెంట్స్తో పోలిస్తే ఈ క్రీమ్స్ బెటరా? హెల్త్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఏదీ మంచిది కాదంటున్నారు. కాయిల్స్, స్టీలు, లిక్విడ్స్, రెపెల్లెంట్స్ పిల్లలకు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక ఒంటికి రాసే క్రీములతో ఊపిరితిత్తుల సమస్యలతోపాటు రకరకాల చర్మ సమస్యలూ తప్పవంటున్నారు.
ఒక్క రెపెల్లెంట్ 137 సిగరెట్లతో సమానం
రెపెల్లెంట్స్ లో ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది ఎన్నో ఆనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. సాధారణంగా మనం వాడే లోషన్స్ చిన్న పిల్లల చర్మానికి అంత మంచిది కాదు. పెద్దవాళ్ల చర్యంతో పోలిస్తే పిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వీటిని వాడేటప్పుడు ముందుగా డాక్టర్ల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు లోషన్స్ రాయడం వల్ల దానిని చేతులతో రుద్ది అవే చేతులను మళ్లీ నోట్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల హానికారక రసాయనాలు నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
మరేం చేయాలి?
దోమల నివారణకు వాడే కాయిల్స్, స్పీలు, లిక్విడ్స్, రెపెల్లెంట్స్ ఏదైనా సరే.. పిల్లలు గదిలో లేనప్పుడే వాడాలి. ఒకవేళ పిల్లలు ఇంట్లో ఉంటే గదిలో కాకుండా ఎంట్రన్స్ లో పెట్టాలి. దీని వల్ల దోమలు లోపలి రాకుండా ఉంటాయి. కెమికల్స్ తో కూడినవి కాకుండా... దోమల నుంచి తప్పించుకునేందుకు హెర్బల్ ఆయిల్స్ వాడొచ్చు.
నిమ్మ యూకలిప్టస్ ఆయిల్ పిల్లల చర్మానికి రాసినా ఆ ఘాటు వాసనకు దోమలు దగ్గరకు రావు. అయితే మూడేళ్లలోపు పిల్లలకు ఈ ఆయిల్స్ వాడకుండా ఉండడం మంచింది ఎందుకంటే వాళ్ల చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. ఘాటు ఆయిల్స్ ను కూడా తట్టుకోలేదు. అటువంటప్పుడు దోమతెర వాడడం బెటర్, పెద్దవాళ్లు అయితే ఆయిల్స్ వాడొచ్చు.
== వెలుగు లైఫ్