
హైదరాబాద్: 8 మంది కార్మికుల టన్నెల్లో చిక్కుకుంటే.. సీఎం మాత్రం ఎన్నికల ప్రచార సభలో ఉన్నారు. రేవంత్‌రెడ్డికి కార్మికుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ ఎస్ఎల్ బీసీ సందర్శనకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఘటన జరిగి ఇన్ని రోజులైన సహాయ చర్యలు ఇప్పటికీ ప్రారంభం కాలేదన్నారు. ‘ టన్నెల్లో కార్మికులు చిక్కుకుపోవటం దురదృష్టకరం.. సహాయ చర్యలపై సీఎం సూచనలు చేయాల్సిన అవసరం లేదా.? ఈ ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.
హెలికాప్టర్‌నుంచి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా.? ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుంది. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైంది. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికి మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎస్ఎల్ బీసీ కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశాం. మేం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల ఫండ్స్ఇచ్చాం. రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని కూడా తవ్వలేదు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, సీఎం సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. ’ అని హరీశ్‌రావు అన్నారు.