కల్కి, గణపథ్ సినిమాల కథ ఒకటేనా? టీజర్ చూస్తే అలానే ఉంది

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger shraf), బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab bachhan), కృతి సనన్(Kriti sanon) ప్రధాన పాత్రల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ గణపథ్(Ganapath).  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు.. వికాస్ బాల్(Vikas bal) దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ మూవీ.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా గణపథ్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ టీజర్ చుసిన ఆడియన్స్ గణపథ్ సినిమాను ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాతో పోల్చుతున్నారు. కారణం కల్కి సినిమా 2898వ సంవత్సరంలో జరిగితే.. గణపథ్ సినిమా 2070లో జరిగే కథ. అంతేకాదు రెండు టీజర్స్ కాన్సెప్ట్ కూడా ఒకేలా ఉంది. కొంత మంది ప్రజలను వేధిస్తుంటారు. వారి కోసం ఒక కొత్త అవతారంలో వచ్చిన హీరో వారి కష్టాలను తీర్చి వారిని కాపాడుతాడు. గణపథ్ సినిమాకు ఏ హీరో ఈజ్ బార్న్ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ రెండు సినిమాల కాన్సెప్ట్స్ ఒకేలా ఉన్నాయనే సందేహం రాకమానదు. 

అయితే కథలో కొన్ని సేమ్ ఎలిమెంట్స్ ఉన్నా.. ప్రెజెంటేషన్ పరంగా మాత్రం ఈ రెండిటికి చాలా తేడాలు ఉండే అవకాశం ఉంది. టైగర్ ష్రాఫ్ గణపథ్ మూవీ పూర్తి కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంటే.. ప్రభాస్ కల్కి మాత్రం స్కైఫై మూవీగా రానుంది. అంతేకాదు కల్కి మూవీలో మహా విష్ణువు అవతారాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఈ రెండు సినిమాల ప్రెజెంటేషన్ లో చాలా వ్యత్యాసం ఉంది. మరి దాదాపు ఒకే కథతో వస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.