
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ సూరన్న భగభగ మండిపోతున్నాడు. ఎండ వేడికి జనం విలవిలలాడిపోతున్నారు. అడవిజంతువుల మూగరోదన అయితే ఇక చెప్పరాదు. ఎడారిలో ఉన్నామా అన్నట్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాలు ప్రకారం తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మంగళవారం (ఏప్రిల్ 22) ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 44.3 డిగ్రీల సెల్సియస్ తో ఆదిలాబాద్ భగభగమండుతోంది. ఆ తర్వాత 44 డిగ్రీలతో నిజామాబాదు రెండో స్థానంలో ఉంది. హైదరాబాదులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ -42.8
రామగుండం -42.3
మహబూబ్ నగర్-41.2
హన్మకొండ- 40.5
ఖమ్మం- 40