ఇన్సెక్యూరిటీ.. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ స్టేజ్ ని దాటాల్సిందే. కొందరు దీని నుంచి తేలికగానే బయటపడతారు. కానీ, మరికొందరు మాత్రం ఆ జోన్ లోనే ఉండిపోతారు. చిన్న చిన్న విషయాలకి కూడా ఇన్సెక్యూర్ గా ఫీలవుతారు. వాళ్ల ప్రపంచాన్ని ఎవరో తీసుకెళ్లినట్టు బాధపడుతుంటారు. అయితే దీనికి కారణాలు తెలియాలంటే వాళ్లు దాటొచ్చిన లైవ్ లోకి ఒకసారి తొంగి చూడాలి..
నాన్న చెల్లిని ఎక్కువ ముద్దు చేస్తే ఇన్సెక్యూర్ ఫీలవుతారు కొందరు పిల్లలు. బెస్ట్ ఫ్రెండ్ మరొకరితో క్లోజ్ మాట్లాడితే ఇబ్బంది. పడుతుంటారు ఇంకొందరు. స్కూల్, కాలేజీల్లో తమని దాటి ఎవరైనా ముందుకెళ్తారేమో అని భయపడుతుంటారు మరికొందరు. వర్క్ ప్లేస్లోనూ చాలామందిని ఇన్సెక్యూరిటీ వెంటాడుతుంటుంది. ఇవన్నీ సిల్లీగానే అనిపించినా.. వాళ్ల ప్లేస్లో ఉండి చూస్తే అసలు వాళ్లు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది అంటున్నారు సైకాలజిస్ట్లు..
Also Read : అక్టోబర్ 28 శరత్ పౌర్ణమి: ఆరోజు వెన్నెలలో పెట్టిన పాయసం తింటే... ఏం జరుగుతుందో తెలుసా..
ట్రస్ట్ బ్రేక్..
బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ లే చాలామందిని ఇన్ సెక్యూరిటీలోకి నెట్టేస్తాయి. ఎవరైనా చిన్నప్పుడు వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేసినా, సంతోషంగా లేకపోయినా ఇన్సెక్యూరిటీ వెంటాడుతుంది. ఎవరూ ప్రేమించట్లేదు, పట్టించు కోవట్లేదు అనే భయాలు కూడా ఇన్ సెక్యూరిటీకి దారితీస్తాయి. చిన్నపిల్లలో ఇదే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
ఇంట్లోకి కొత్తగా చెల్లిలేదా తమ్ముడు వస్తే వాళ్లు తమ స్థానాన్ని ఎక్కడ భర్తీ చేస్తారో అని భయపడుతుంటారు కొందరు పిల్లలు. దీన్ని చూసీ చూడనట్టు వదిలేస్తే వాళ్లలో ఆ ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ మరింత పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడే పిల్లల్లో ఆ ఫీలింగ్ ని తీసేయడానికి పేరెంట్స్ ట్రైచేయాలి. ఇంట్లో వాళ్ల విషయంలోనే కాదు బయటివాళ్ల వల్ల పిల్లలు ఇన్సెక్యూర్ గా ఫీలైనా జాగ్రత్తపడాలి.
ఎమోషనల్గా..
కొందరికి కొందరితో స్పెషల్ బాండ్ ఉంటుంది. ఎమోషనల్గా, మెంటల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారు వాళ్లతో.. అలాంటి వాళ్లు కొంచెం దూరం జరిగినా లేదా వేరేవాళ్లకి దగ్గరయినా తట్టుకోలేరు. వాళ్లు దూరమవుతారేమో అన్న ఆలోచన నుంచి కూడా ఇన్సెక్యూరిటీకి బీజం పడుతుంది. అది నెమ్మదిగా అసూయగా మారి, డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది.
అందుకే ఎవరైనా ఇన్ సెక్యూర్ ఫీలవుతుంటే తేలికగా తీసుకోవద్దు. ఇన్సెక్యూర్ వలకి చిక్కకూడదంటే ఇతరులపై డిపెండ్ కాకూడదు. ఎవర్నివాళ్లు ప్రేమించుకుంటే.. ఉన్న లైఫో సంతృప్తిగా ఉంటే ఇన్సెక్యూరిటీ దరిచేరదు.