ప్రతీది మర్చిపోతున్నారా.. అయితే ఏం చేయాలంటే..?

యాబై, అరవై ఏళ్ల వయసులో కనిపించే మతిమరుపు ఛాయలు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తున్నాయి. చిన్నచిన్న విషయాల్ని కూడా మర్చిపోతున్నారు చాలామంది. మరి ఈ మతిమరుపు సమస్య నుంచి బయటపడటం ఎలాగంటే.. దీనికి కొన్ని టెక్నిక్కులు​ ఉన్నాయి.అవేంటో చూద్దామా..

మైండ్ కి పదును

మతిమరుపుతో బాధపడేవాళ్లు చిన్నప్పటి విషయాలు లేదా ఇష్టమైన వారితో గడిపిన మెమరబుల్ మూమెంట్స్​ని గుర్తు చేసుకుంటుండాలి. లేదంటే టైం దొరికినప్పుడల్లా ఈజీగా హ్యాండిల్ చేసే పజిల్స్ సాల్వ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మైండ్ షార్ప్ గా ఉంటుంది. దానివల్ల మెమరీ పవర్​ ఆటోమెటిక్ గా పెరుగుతుంది.

మల్టీ టాస్క్ లు వద్దు

ఒకేసారి రెండు పనులు చేయడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల మైండ్ పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అందువల్ల ఏ రోజు ఏ పని చేయాలో ముందుగానే నోట్ చేసుకోవాలి. అందులో ముఖ్యమైన వాటి నుంచి మొదలుపెట్టి పనులు వరుసగా చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల మైండ్ ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది.

8 గంటలు నిద్ర అవసరం

కచ్చితంగా ప్రతిరోజూ 8 గంటలపాటు నిద్రపోవాలి. దానివల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎర్లీగా పడుకుని, ఎర్లీగా లేవడమన్నది అలవాటుగా చేసుకోవాలి. దీనివల్ల ప్రతిరోజు మైండ్ యాక్టివ్ గా ఉంటుంది.