Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..

Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..

చలికాలంలో తరచూ తలనొప్పి వస్తోందంటూ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు.. మైగ్రైన్, సైనస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్లకు సహజంగానే చలికాలంలో సమస్య ఎక్కువవుతూ ఉంటుంది. మరోవైపు చలికాలంలో పొద్దున్నే లేవడానికి చాలామంది ఇష్టపడరు.. లేట్ గా లేద్దాం అనుకుంటారు కానీ.. పనుల వల్ల ఉదయాన్నే లేవాల్సి వస్తుంది. దీనివల్ల స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయ్యి తలనొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే.. కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చలికాలంలో వచ్చే తలనొప్పి నుండి రిలీఫ్ పొందవచ్చు... అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో వచ్చే తలనొప్పిని దూరం చేసే చిట్కాలు:

హీటింగ్ ప్యాడ్ వాడటండి:

హీటింగ్ ప్యాడ్స్ వాడటం వల్ల చలికాలంలో వచ్చే తలనొప్పి నుండి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. చలి తలనొప్పి వచ్చినప్పుడు తలపై కొద్దిసేపు హీటింగ్ ప్యాడ్ పెట్టడం వల్ల త్వరగా రిలీఫ్ వస్తుంది.. అంతే కాకుండా మెడ, భుజాలపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

మసాజ్ థెరపీ:

చలి వల్ల వచ్చే తలనొప్పికి మసాజ్ థెరపీ మంచి రెమిడీ అని చెప్పచ్చు. తలనొప్పి వచ్చే ట్రిగర్ పాయింట్ దగ్గర మసాజ్ చేస్తే క్షణాల్లో నొప్పి మాయమై రిలీఫ్ వస్తుంది. మసాజ్ వల్ల తలనొప్పి మాత్రమే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

బ్రీతింగ్ ఎక్సర్సైజెస్:

తలనొప్పి నుండి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అందరి వల్ల సాధ్యం అవ్వదు. కానీ.. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల బాడీ మజిల్స్ రిలాక్స్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. క్రమం తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు.

డైట్ లో మార్పులు:

చలికాలంలో తలనొప్పికి కారణమయ్యే కెఫైన్ వంటి పదార్థాలను డైట్ నుండి తీసేయడం మంచిది. ఎక్కువ కెఫైన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల బాడీ త్వరగా డిహైడ్రేట్ అయ్యి తలనొప్పికి దారి తీస్తుంది. చలికాలంలో తరచూ తలనొప్పి రాకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి.. ఎక్కువగా నీరు తాగటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ అన్ని బయటకు పోయి తలనొప్పి వచ్చే ఛాన్స్ ని తగ్గిస్తుంది. 

డాక్టర్ ని సంప్రదించండి:

పైన తెలిపిన టిప్స్ ఫాలో అయినప్పటికీ తలనొప్పి తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించటం మంచిది. డాక్టర్ తలనొప్పికి గల కారణాన్ని అనలైజ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి తలనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించటం మంచిది.