అంబేద్కర్ కంటే గొప్పవాడివా కేసీఆర్ ?.....ములుగు ఎమ్మెల్యే సీతక్క

  • ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్

" అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలె, కుమ్రం భీం కన్నా మీరు గొప్పవారా ? " అని కేసీఆర్ ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తించాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలపై ప్రశ్నిస్తే.. బలహీన వర్గాల ప్రజల్ని కుక్కలు నక్కలు అంటారా ? అని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు సీతక్క. భారత రాజ్యాంగం జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.