ఆధార్ కార్డు పోయిందా.. కొత్తదాని కోసం ఇలా చేయండి

ఆధార్ కార్డు పోయిందా.. కొత్తదాని కోసం ఇలా చేయండి

ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఏం చేయాలన్నా.. ఎక్కడకు వెళ్లాలన్నా ఆధార్ కార్డు జిరాక్స్ వెంట పెట్టుకుని వెళ్లాల్సిన రోజులివి. బయట ఏం చేయాలన్నా.. ఏ  సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. ఎటువంటి ఆన్ లైన్ సేవలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అవుతోంది. ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే ఇది ఐడెంటిటీ కార్డుగా కూడా పనిచేస్తుంది. పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు కూడా ఉపయోగించొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ ఒరిజినల్ కనిపించడం లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డు పోయినా? లేదంటే చినిగి పాడైపోయినా కొత్త డూప్లికేట్ ఆధార్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే కొత్త కార్డు తెప్పించుకోవచ్చు. కేవలం 50 రూపాయలు ఖర్చుతో కొత్త ఆధార్ కార్డు ఇంటికే వచ్చేస్తుంది

కొత్తది పొందడానికి ఏం చేయాలంటే..
ఆధార్ కార్డు కనిపించకుండా పోయిన తర్వాత దాన్ని తిరిగి పొందాలనుకునే వారికి  యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఒక ఆప్షన్ అందిస్తోంది. అదే ఆధార్ రీప్రింట్. దీని ద్వారా ఆధార్ కార్డు కనిపించకుండాపోతే దాన్ని మళ్లీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఆధార్ కార్డు రీ ప్రింట్ కోసం రూ.50 ఖర్చవుతుంది. కొత్త ఆధార్ కార్డు కాపీ పోస్టులో మీ ఇంటికే వస్తుంది. గతంలో ఇ-ఆధార్ కార్డును మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ప్రూఫ్‌గా వినియోగించేవారు. అయితే ఇప్పుడు దీనితో కూడా అవసరం లేదు. పోగొట్టుకున్న ఆధార్ కార్డును మళ్లీ కొత్తగా పొందే సౌకర్యాన్ని UIDAI అందుబాటులోకి తెచ్చింది. 
ఆధార్ కార్డు నెంబర్ లేదా వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సాయంతో ఆధార్ కార్డు రీప్రింట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉంటేనే రీప్రింట్ కు అవకాశం ఉంటుంది. మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీని కోసం మొబైల్ నెంబర్ కచ్చితంగా కావాలి.
ఆధార్ కార్డు రీప్రింట్ ఇవ్వాలంటే ముందుగా యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్‌కు వెళ్లాలి..
సైట్ ఓపెన్ కాగానే అందులో ఆర్డర్ ఆధార్ రీప్రింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
 ఇప్పుడు 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీని ఎంటర్ చేయాలి. 
తర్వాత సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి, రిక్వెస్ట్ ఓటీపై క్లిక్ చేయాలి.
కొద్దిసేపట్లో ఆధార్ తో లింక్ అయి ఉన్న మొబైల్ కు ఓటీపీ పాస్ వర్డ్ వస్తుంది.
దీన్ని ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. 
తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ ద్వారా ఆన్ లైన్ లో నే ఫీజు చెల్లించాలి. 
తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ మెసేజ్ వస్తుంది.
దీని ద్వారా మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుస్తుంది. 
ఇప్పటికైనా ఆధార్ కార్డు ఉన్న వారు తమ మొబైల్ నెంబర్ మారి ఉంటే ఆధార్ లో కొత్త మొబైల్ నెంబర్ ను రీప్లేస్ చేసుకోవడం ఉత్తమం.