కిచెన్​ లో ఇది పొయ్యి దగ్గర ఉందా... ప్రమాదమేనంట..

 కిచెన్​ లో ఇది పొయ్యి దగ్గర ఉందా... ప్రమాదమేనంట..

కిచెన్​ లో అత్యంత ముఖ్యమైన పదార్థం ఆయిల్​.. ఇది లేకుండా దాదాపు ఏ కర్రీ చేయలేము... ఎంత తక్కువ వాడినా.. కనీసం పోపు చేసేటప్పుడైనా దీనిని ఖచ్చితంగా వాడాల్సిందే.  నేడు హైటెక్​ యుగంలో మహిళలు కూడా జాబ్​ చేయాల్సిన పరిస్థితి.  అలాంటి వారు రెగ్యులర్​ గా వాడే వంట సామాగ్రిని పొయ్యి దగ్గర అందుబాటులో ఉంచుకుంటారు. అలాంటి ఐటమ్స్​ లో ఆయిల్​ చాలా  ముఖ్యం.  దీనిని చాలామంది మహిళలు స్టవ్​ పక్కనే పెట్టుకుంటారు.  అయితే అలా పెట్టుకుంటే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

త్వర త్వరగా వంట పూర్తి చేసుకోవాలి.. ఆఫీసుకు వెళ్లాలనే ఆలోచనలతో వంట పని పూర్తి కావాలంటే స్టవ్ కు దగ్గర్లోనే అన్ని వస్తువులు అందుబాటులో ఉండే చకచకా వంట పని పూర్తి చేయవచ్చని భావిస్తుంటారు. ఈ తరుణంలో స్టవ్ కు దగ్గర్లోనే పోపు దినుసుల బాక్స్, ఆయిల్ బాటిల్, మసాలాలు, పసుపు తదితర సామాన్లను అమర్చుకుంటారు.  స్టవ్ దగ్గర వాటిని నీటిగా అమర్చుకున్నా కూడా ఆ స్థలం మంచిది కాదని ఓ అధ్యయనంలో తేలింది. స్టవ్ కు దగ్గర్లో వంటసామానులో ముఖ్యమైన ఆయిల్ ను ఉంచడం ద్వారా ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.


స్టవ్ పక్కన వంటనూనె పెట్టుకుని తరచూ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారువాడిన తర్వాత నూనె బాటిల్ పై మూతను తెరిచి ఉంచడం వల్ల అందులో కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దీంతో నూనె నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుందని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు పొరపాటున ఆయిల్ సీసాలను స్టవ్ వద్ద పెట్టుకోవడం వల్ల వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందని అధ్యయనంలో తేలింది. 

ఎక్కడ పెట్టుకోవాలంటే... 

నూనె బాటిల్ ను స్టవ్ పక్కన అస్సలు ఉంచకూడదని అంటున్నారు. గాలి, వెలుతురు సరిగ్గా తగిలే చోట ఉంచి, దానిపై మూతను గట్టిగా పెట్టి ఉంచాలని అంటున్నారు.  వాడిన నూనెను మళ్లా వాడితే ఊబకాయం, జీర్ణ సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు  త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.