కొత్త ఉద్యోగం వెతుకుతున్నారా.. ఇలా చేస్తే గ్యారంటీగా వస్తుంది

కొత్త ఉద్యోగం వెతుకుతున్నారా.. ఇలా చేస్తే గ్యారంటీగా వస్తుంది

ఏ పనైనా మనసు పెట్టి చేస్తేనే రిజల్ట్ బాగుంటుంది. జిమ్ లో వర్కవుటైనా, జాబ్ ట్రయలైనా ఇదే నియమం వర్తిస్తుంది. కొత్తగా జాబ్ వెతుక్కునేవాళ్లు మైండ్ని ఫ్రెష్, యాక్టివ్గా ఉంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మెంటల్గా యాక్టివ్గా ఉండడం చాలా ముఖ్యం. అందుకు ఏంచేయాలంటే...

• మిగతా వాళ్ల కంటే స్పెషల్గా ఉండాలంటే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కొన్ని వెబ్ సైట్లు ఫ్రీ లాంగ్వేజ్ కోర్సులు అందిస్తున్నాయి.

• ఇప్పటివరకు చేసిన జాబ్ ప్రయత్నాలు ఎందుకు ఫెయిల్ అయ్యాలో ఆలోచించుకోవాలి. మళ్లీ అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కెరీర్ ఇదే అనుకున్న ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అప్ -టు-డేట్ ఉండాలి. ఫ్రీ నెట్ వర్కింగ్ ఈవెంట్స్లో భాగమవ్వాలి. స్కిల్స్ నేర్చుకునేందుకు ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలి. జాబ్ వెతుక్కునే టైంలో టీవీ చూస్తూ, శ్నాక్స్ తింటూ కూర్చోవద్దు. వీటి బదులు మైండ్ రిలాక్స్ చేసే గేమ్స్ ఆడాలి. ఇంటి దగ్గరే వర్కవుట్స్ చేయాలి. నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని కొంచెం సేపు డాన్స్ చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు స్ఫూర్తినిచ్చే ఆర్టికల్స్, బుక్స్, కోటేషన్స్ చదవాలి.

ALSO READ: Kitchen Tips : పచ్చి మిర్చి రెండు నెలలు తాజాగా ఉండాలంటే ఇలా చేయాలి..!

• రూంలో వస్తువులన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. అవసరం లేనివి,రీ-సైకిల్, డొనేట్ చేయడానికి వీలైన వస్తువులు, డ్రెస్ లాంటివి చక్కగా సర్దేయాలి. అప్పుడే గది శుభ్రంగా ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించడం సాధ్యమవుతుంది.