- ఏరియా జీఎం షాలెం రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ఏరియాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 41.76లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామని ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు తెలిపారు. రుద్రంపూర్‌లోని జీఎం ఆఫీస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వానలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామన్నారు. రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్వోటూజీఎం జీవీ. కోటిరెడ్డి, అధికారులు సీహెచ్. రామకృష్ణ, హాన సుమలత, శివకేశవరావు, యోహాన్, రవీందర్, రమేశ్, శ్రీకాంత్, ఎం. మురళి, తౌర్య, సేవా సమితి కో ఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు.
ఇల్లెందులో 133 శాతం బొగ్గు ఉత్పత్తి
ఇల్లెందు : జులైలో ఇల్లెందు ఏరియాకు నిర్దేశించిన 2.59లక్షల టన్నులకు గాను, 3.41లక్షల టన్నులతో 133 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జాన్ ఆనంద్ తెలిపారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాల వల్ల కోయగూడెం ఓసీలో మట్టి తొలగించేందుకు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు
సూపర్ వైజర్లు, యూనియన్ నాయకులు, ఉద్యోగులను జీఎం అభినందించారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం మల్లారపు మల్లయ్య, ఏజీఎం(ఐఈ) గిరిధర్ రావు, డిజీఎం (పర్సనల్) జివి. మోహన్ రావు, డీజీఎం (సివిల్) రవికుమార్, సీనియర్ పర్సనల్ అధికారి సాయి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.