శుక్రవారం (13న) గాంధీ ఇంటిని ముట్టడిస్తాం..కౌశిక్ రెడ్డి హెచ్చరిక

శుక్రవారం (13న) గాంధీ ఇంటిని ముట్టడిస్తాం..కౌశిక్  రెడ్డి హెచ్చరిక

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరినొకరు సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. నువ్వా నేనా చూసుకుందం రా అంటూకయ్యానికి కాలుదువ్వుతున్నారు. 

రేపు.. సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు.. అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళతామని మరోసారి సవాల్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి ర్యాలీ మొదలవుతుందన్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. గాంధీ తన ఇంటికి వస్తే స్వాగతిస్తామన్నారు కౌశిక్ రెడ్డి.  గాంధీని కేసీఆర్ ఇంటికి తీసుకెళతామన్నారు. కాంగ్రెస్ లో చేరలేదన్నప్పుడు కేసీఆర్ దగ్గరకు రావడానికి గాంధీకి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.గాంధీతో తనకు  వ్యక్తిగతమైన వివాదాలు, తగాదాలు ఏమీ లేవన్నారు కౌశిక్ రెడ్డి.  ఇంటికి వస్తానంటే.. కంచెలు వేసి పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. గాంధీ  65 ఏళ్ల ముసలోడు..నేను 39 ఏళ్ల యువకుడిని నేను రెచ్చిపోతే ఎలా ఉంటాదో  చూస్తావా? అని అన్నారు. 

Also Read:-నిన్ను వదిలేదే లేదు.. నువ్వో నేనో తేలిపోవాలి

అరికెపూడి గాంధీ ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. చంద్రబాబు,కేసీఆర్ ను మోసం చేసి కాంగ్రెస్ లో చేరలేదా అని ప్రశ్నించారు .  పార్టీ మారనప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు భయమెందుకన్నారు. అసలు బ్రోకర్ నువ్వా నేనా? కాంగ్రెస్ లో చేరలేదని చెప్పింది అరికెపూడి కాదా? .పూటకో పార్టీ మారింది అరికెపూడి..అని  బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరావ్.  కష్టకాలంలో పార్టీని ఎలా వదిలేశావ్ గాంధీ.. భూ పంచాయతీల కోసమే అమ్ముడుపోయావ్. కేసీఆర్ ఏం తక్కువ చేశాడని పార్టీ మారావ్ . నిజంగా తన్నుకుందాం అంటే.. నువ్వొకనివే రా... నేను ఒక్కడినే వస్తా చూసుకుందాం.  దమ్ముంటే, మోగోనివయితే రాజీనామా చెయ్... బై ఎలక్షన్స్ లో చూసుకుందాం అని సవాల్ చేశారు.

 
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. గాంధీలా పార్టీ మారే బ్రోకర్ ను కాదన్నారు కౌశిక్ రెడ్డి.  గాంధీ సంగతి శేరిలింగంపల్లి నియోజకవర్గం మొత్తం తెలుసు. నేను పుట్టింది తెలంగాణ గడ్డపైనే.నీలా ఎక్కడో పుట్టి.. తెలంగాణ గడ్డపై బతకటం లేదు అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.