పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ గెలిచి రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేయడంతోపాటు నిరుద్యోగం పెరిగేలా చేసిందన్నారు. అందుకే ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారన్నారు. బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చి బలహీనవర్గాల రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్నారు. సమావేశంలో లీడర్లు మల్లేశ్‌గౌడ్, సురేశ్‌గౌడ్, గోపగాని సారయ్యగౌడ్, అక్బర్ అలీ, ఈర్ల స్వరూప తదితరులు పాల్గొన్నారు.
మంథని, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణను భారీ గెలిపించాలని సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఐఆర్‌వీ రాజు అన్నారు. ఆదివారం మంథని మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి ఓటు వేయాలని కోరారు. జాతీయ విశిష్ట సేవా రత్న అవార్డు గ్రహీత దార మధు, మాలమహానాడు కమాన్ పూర్ మండలం అధ్యక్షుడు లింగయ్య, కాంగ్రెస్ నాయకులు రమేశ్, రాజేశ్, అరుణ్ పాల్గొన్నారు.