ఆరేపల్లిలో రైతులు టెంట్ వేసుకుని.. బైఠాయించి..పిండి వంటలతో నిరసన 

  • బైపాస్ రోడ్డు వద్దంటూ వరంగల్‍ జిల్లా ఆరేపల్లిలో రైతుల ఆందోళప

వరంగల్‍, వెలుగు: తమ భూములను కాపాడుకునేందుకు వరంగల్‍ జిల్లా ఆరేపల్లి రైతులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఏనుమాముల మార్కెట్‍ నుంచి ములుగు రోడ్డులో ఉండే అయ్యప్ప గుడి (ఇస్కాన్‍ టెంపుల్‍) వద్దకు పైడిపల్లి మీదుగా 200 ఫీట్ల బైపాస్‍ రోడ్డుకు ప్రతిపాదించారు. బీఆర్‍ఎస్‍ హయాంలో  మాజీ ఎమ్మెల్యేలు కొందరు తమ భూములకు డిమాండ్‍ కోసం   బైపాస్‍ రోడ్డు అలైన్‍మెంట్‍ మార్చారు.

 దీనికితోడు రోడ్డు చివర్లో మరికొందరు లీడర్లకు చెందిన హాస్పిటల్‍, స్కూళ్లకు కలిసి వచ్చేలా రోడ్డును 90 డిగ్రీలు వంకర తిప్పారు. దీంతో పలువురు రైతుల భూములు పోతుండగా.. ఆందోళనలు చేశారు. అధికారులను కలిసి వినతి పత్రాలు అందించారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ రావడంతో బాధిత రైతు కుటుంబాలు ఉదయం పొలాల వద్దకు చేరారు. టెంట్‍ వేసుకుని  బైఠాయించారు. అక్కడే పొయ్యి పెట్టి పిండి వంటలు చేశారు. లీడర్ల మేలు కోరేలా తమను రోడ్డు పాలు చేసే బైపాస్‍ రోడ్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‍ చేశారు.