బీజేపీలోకి ఆరెపల్లి మోహన్ .. మానకొండూర్‌ నుంచి పోటీ!

మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే   ఆరెపల్లి మోహన్  2023 అక్టోబర్  12 గురవారం రోజున బీజేపీలో చేరనునన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ సమక్షంలో  ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.  ఈ మేరకు  ఆయన ఇవాళ బండి సంజయ్ ను కలిశారు. రేపు ఆరెపల్లితోపాటు పలువురు మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు పార్టీలో చేరుతారని బీజేపీ ప్రకటించింది.   

2009లో  ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మానకొండూర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీకి నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ లో చేరారు.  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాల్లో కొందరిని మారుస్తారని తెలిసి మోహన్‌ తనకు మానకొండూర్‌ నుంచి కాని, చొప్పదండి నుంచి గాని టికెట్‌ లభిస్తుందని ఆశించారు.  

 ALSO READ : సారొస్తారొస్తారు!.. కేసీఆర్ పైనే గులాబీ అభ్యర్థుల ఆశలు

కానీ సిట్టింగ్‌ లందరికి మళ్లీ వారి వారి స్థానాలను కట్టబెట్టడం, తనకు కార్పొరేషన్‌ పదవి ఇచ్చే విషయంలో ఏ హామీ లభించక పోవడంతో ఆయన ఈనెల 14న బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు మానకొండూర్‌ నుంచి  బీజేపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది.