ఫ్రెంచ్ ఓపెన్లో ఎల్ సాల్వడార్-నెదర్లాండ్స్ జంట అదరగొట్టింది. మార్సెలో అరెవాలో, జీన్-జూలియన్ రోజర్ జోడి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ను సాధించింది. క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్, అమెరికాకు చెందిన ఆస్టిన్ క్రాజిసెక్‌లపై 6-7 (4), 7-6 (5), 6-3తేడాతో గెలిచింది. ఇక 40ఏళ్ల రోజర్ అత్యధిక వయసులో గ్రాండ్ స్లామ్ పురుషుల డబుల్స్ టైటిల్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అతను 2017 యూఎస్ ఓపెన్ ఫైనల్లో హోరియా టెకావుతో కలిసి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అయితే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకారం.. అరెవాలో సెంట్రల్ అమెరికా నుంచి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచాడు. 12వ సీడెడ్ ప్లేయర్లు బరిలోకి దిగిన అరెవాలో, రోజర్ జంట..అన్ సీడెడ్ ఆటగాళ్లు డోడిగ్, క్రాజిసెక్పై గెలిచారు. అయితే మొదటి సెట్ను కోల్పోయిన అరెవాలో, రోజర్ జోడి.. రెండో సెట్‌లో 6-5తో వెనుకబడింది. అయితే అరెవాలో, రోజర్ జంట భీకరంగా పోరాడి పుంజుకుంది. టై బ్రేక్గా మారిన రెండో సెట్ ను 7-6తో దక్కించుకుంది. ఇక అదే ఊపును కంటిన్యూ చేసి.. మూడో సెట్ను 6-3తేడాతో దక్కించుకుని ట్రోఫిను సగర్వంగా ఎత్తుకుంది.
Ils ont sauvé trois balles de titre avant de renverser complètement le match pour s'imposer en 3h 6/7(4), 7/6(5), 6/3 ?????#RolandGarros
— Roland-Garros (@rolandgarros) June 4, 2022