Govt Layoffs: 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు.. ఎక్కడో తెలుసా

గతేడాది కాలంగా ప్రవేట్ కంపెనీలు లేఆఫ్స్ పేరుతో ఉద్యోగుల తొలగింపులు  చేపడుతున్న విషయం తెలిసిందే.. 2023లో లక్షల్లో ఉద్యోగులను ప్రైవేట్ కంపెనీలు తొలగించాయి. 2024 మొదటి మూడు నెలల్లో కూడా సుమారు 70వేల మంది ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు లేఆఫ్స్ లెటర్స్ అందుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడి ఉద్యోగుల తొలగింపులు మొదల య్యాయి. తాజాగా అర్జెంటినా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
 
రాబోయే కొన్ని నెలల్లో  సుమారు 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు  అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ ప్రకటించారు.ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది. అర్జెంటీనాలో ఉన్న 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇది కొద్ది శాతమే అయినప్పటికీ కార్మిక సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకావం ఉంది. ఇప్పటికే కార్మిక వర్గానికి చెందిన ఒక యూనియన్ మార్చి 26న సమ్మెను ప్రారంభించింది.