
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఎర్రగట్టు బొల్లారం గ్రామ సమీపంలో పొడు భూముల పై ఫారెస్ట్ ఆఫీసర్లకు..పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోడు భూములలో చెట్లు నాటిన ఫారెస్ట్ అధికారులను గిరిజనలు అడ్డుకున్నారు.దీంతో ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఇద్దరు గిరజన మహిళలు ఆత్మహత్యాయత్నం చేయగా..వారి బంధువులు అడ్డుకున్నారు.