![లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కామ్ రచ్చ.. ఆయన పేరు ఎత్తొద్దని మిథున్ రెడ్డికి స్పీకర్ వార్నింగ్](https://static.v6velugu.com/uploads/2025/02/argument-between-mps-in-lok-sabha-over-ap-liquor-scam_y3afwqMScr.jpg)
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (ఫిబ్రవరి 11) లోక్ సభలో ఏపీ లిక్కర్ స్కామ్ టాపిక్‌పై వైసీపీ, బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీ లిక్కర్ స్కామ్ అంశాన్ని లేవనెత్తారు. 2019-2024 మధ్యకాలంలో ఏపీ లిక్కర్ పాలసీ మార్చి.. ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకొచ్చారు. ఐదేళ్లలో లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా నగదు రూపంలో అమ్మకాలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే.. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ పదిరెట్లు పెద్దది. ఏపీ లిక్కర్ స్కామ్‌పై సమగ్ర విచారణ జరపాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సీఎం రమేష్ ప్రసంగానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుతగిలారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
ALSO READ | జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండండి: మంత్రులతో సీఎం చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సీఎం రమేష్ టీడీపీ ఎంపీలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి చంద్రబాబు పేరు ప్రస్తావించడంతో స్పీకర్ కలగజేసుకుని.. సభలో లేని వారి పేరు ప్రస్తావించొద్దని మిథున్ రెడ్డిని వారించారు. ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఎంపీలు మిథున్ రెడ్డి, సీఎం రమేష్ ల మధ్య వాగ్వాదంతో లోక్ సభ హీటెక్కింది.